Tuesday, 3 November 2026

అధైర్య పడొద్దు రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే షిండే భరోసా

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 28 (జనంసాక్షి)అకాల వర్షం వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్శాసనసభ్యుడు ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామ శివారులో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను భరోసా కల్పించారు. రైతులు ఏమి అధైర్య పడవద్దని, ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కష్టాలను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూసి చలించిపోయారని, అందుకే నేడు రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, వైస్ ఎంపీపీ రాజు పటేల్, భూమిశెట్టి, మండల రైతుబంధు అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, వెంకట్రావు దేశాయ్, వ్యవసాయ అధికారి పోచయ్య, రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.