వేమనపల్లి,ఏప్రిల్ 28,(జనంసాక్షి):బెల్లంపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరు యాత్ర కొనసాగుతోంది.శుక్రవారం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ప్రజా పోరు యాత్ర జరిగింది.ప్రజా పోరు యాత్రకు సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ నేతృత్వంలో 11వ రోజుకు చేరుకుంది.వీరితో పాటు ప్రజా పోరు యాత్ర దళసభ్యులు డాక్టర్ శ్రీధర్,బొంతల లక్ష్మీ నారాయణ,అక్కపల్లి బాపు,దాడి గట్టయ్య, పోతుల లింగయ్య,బండారి శంకర్,స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర కొనసాగుతుంది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఐ చేస్తున్న ప్రజా పోరు యాత్రను ప్రజలు ఆదరించాలని కోరారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని,పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించాలని,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని,అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో అందే పురుషోత్తం,బొంతల లక్ష్మీ నారాయణ,గుండ చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్,అడెపు రాజమౌళి,కొంకుల రాజేష్,దెవరబోయిన చిన్న శంకర్, దేవరబోయిన బాపు,శీలం చంద్రయ్య,రత్నం రాజం,బండారి శంకర్,వినోద్,అందే మహేష్,ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.




