Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 28,(జనంసాక్షి):నీల్వాయి గ్రామపంచాయతీ కల్మలపేట గ్రామానికి చెందిన సంగెం శంకర్ కి 30000/- వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోళీ వేణుమాధవ్ రావు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు.అనారోగ్యానికి గురైన ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా నిధులు అందజేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, బెల్లంపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల లింగగౌడ్,బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.