అనంతపురం(జనం సాక్షి): పెనుకొండ మండలం గుట్టూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఏడుగురు పిల్లలతో కలిసి విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో తల్లీపిల్లలను హుటాహుటిన పెనుకొండ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల వల్లే సదరు మహిళ పిల్లలతో ఆత్మహత్యయత్నం చేసినట్లు సమాచారం.
అనంతపురంలో విషాదం




