Friday, 6 November 2026

అనంత గిరి గుట్టలో బసు బోల్తా పడి మహిళ మృతి చెందడం బాధాకరం

అనంత గిరి గుట్టలో బసు బోల్తా పడి మహిళ మృతి చెందడం బాధాకరం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ దుస్థితి

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్

వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి మహిళా మృతి చెందడం బాధాకరం. చాలామందికి గాయాలయి ఆసుపత్రిలో పాలయ్యారు. డొక్కు బసులతో కాలం గడుపుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. వికారాబాద్ డిపో ఆర్టీసీ లాభాల్లో ఉన్న బస్సుల లోపాలు మాత్రం చాలానే ఉన్నాయి. రోడ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గాయాల పాలైన వారికి ఆర్థికంగా ఆదుకోవాలి.