
కంటోన్మెంట్ జనం సాక్షి జులై 01 న్యూ బోయిన్ పల్లి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ లో చదలవాడ తిరుపతిరావు,చదలవాడ శ్రీనివాసరావు వారి కుమారులు శరత్ బాబు,కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరై అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ దారుశిల్ప, రూపుదిద్దుకున్న కళాఖండాన్ని ఆవిష్కరించారు.ఈ అనంత శేషశయన శ్రీమహా విష్ణుమూర్తిప్రపంచం లోనే అతి పెద్దబర్మాకు జాతి మహా వృక్షము ఇది.ఇరవై ఒక్క అడుగులు పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు,ఇరవై అడుగుల కైవారం కలిగినదాని వయసు సుమారు వెయ్యి నుండి పదిహేను వందల సంవత్సరాలు ఉంటుంది, ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచం లోనే అరుదైన ఈ టేకు దుంగను అనురాధ టింబర్స్ ఇంటర్నేషనసంస్థ వారు బర్మా గవర్నమెంట్, ఇంటర్నేషనల్ వేలం పాట లో భారీ మొత్తంలో ఖరీదు చేసి విజయవంతంగా దక్కించు అరుదైన వృక్ష ఖండ మీది ఈ చెట్టును వ్యాపార నిమిత్తం కోసి ముక్కలు చేయకుండా భావితరాలకు దీని భవ్య రూపాన్ని పదిలపరచాలని, చెడగొట్టకుండా, దీనిని అద్భుతమైన శిల్ప కళా ఖండం తీర్చిదిద్ది రాబోయే తరాలకు ప్రదర్శన యోగ్యమైన రీతిలో అందించాలనే సదుద్దేశ్యంతో తో ఆ విశేషమైన వృక్ష ఖండాన్నిశిల్పంగా చేయించాలని, సంస్థ వారు గట్టిగా సంకల్పించారు.ఈ బృహత్ ప్రణాళికకు సమర్థుడైన చిత్రకారుని అన్వేషించారు,అప్పుడు వారి దృష్టికి గిరిధర గౌడ్ దొరికారు. అతనితో ప్రణాళిక సిద్ధం చేయించి, చాలా రేఖా చిత్రాలను గీయించి వాటిని బర్మా గవర్నమెంట్ కు చూపించి పర్మిషన్ కొరకు అప్లయ్ చేయగా అతి కష్టమైన రీతిలో సంవత్సరం కాలం తర్వాత అధికారిక అంగీకారం వచ్చితరువాత యోగ్యులైన బర్మా శిల్పులతో శిల్పం పూర్తి చేయించి ఇండియా తీసుకుని రావడానికి మరలా రెండు నుండి మూడు సంవత్సరాలు సమయం పట్టింది, అక్కడ చెక్కి ప్రభుత్వానికి చూపించి అనుమతి అప్పుడు దాన్ని ఓడమీద భారతతీరానికి చేర్చారు. చుట్టూ భద్రత కొరకు భారీ ప్యాకింగ్ పద్ధతి ని అవలంబిం కంటెయినర్ లో దాన్ని హైదరాబాదుకు చేర్చారు.ఇప్పుడు బోయినపల్లిలోని అనూరాధా టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఆ శిల్పాన్ని గిరిధర్ ఊహించి పూర్తి వివరాలతో శిల్పం పూర్తి అయింది.ఈ దారు శిల్పం పేరు
శ్రీ అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి
దీనిని శ్రీమత్ భగవత్ గీత 11 వ అధ్యాయం 6 వ శ్లోకం ను స్పూర్తిగా తీసుకుని రాయన గిరిధర్ గౌడ్ చే చి ప్రణాళిక ప్రకారము శిల్పాన్ని పూర్తి చేశారు. ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి.
శ్లో: పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్
బహూన్యదృష్ట పూర్వాణి,పశ్చాశ్చర్యాణి భారత!ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా శిల్పం చెక్కబడింది. శ్రీమహావిష్ణువు అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడమ వైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు
అనంతషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి దివ్యాభరణములతో శ్రీశ్రీ మహా విష్ణువు మరియు శ్రీదేవి, భూదేవి సమేతంగా చెక్కబడింది, ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ, విప్పారిన రెక్కలతోపక్షిరాజు గరుత్మంతుడు, నారదమహర్షి,తుంబురుడు,సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సనందనాదులు ఉన్నారు.సకల దేవతా మూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు చెక్కబడింది ఇటువంటి అరుదైన విశిష్టత గలిగిన అపురూపమైన కళా ఖండాన్ని ప్రదర్శన యోగ్యంగా అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ఉంచబడింది. అనంతరం ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహావిష్ణువు పవళించిన సజీవ శిల్పంగా దారు శిల్పం మలచడం గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని కలిగించింది సాంప్రదాయాలను చరిత్రను కాపాడాలని పిలుపు అన్నారు. చదలవాడ తిరుపతిరావు శ్రీనివాసరావు కుటుంబీకులు చేసిన అద్భుత కళాఖండా ఆయన అభినందించారు. విషయాన్ని స్పష్టం చేస్తూ గొప్ప చిత్రకళ రూపాన్ని చేసిన ప్రముఖ కళాకారుడు గిరిధర్ గౌడ్ బర్మాకు చెందిన చిత్రకారులను మహాబలిపురం చిత్రకారుల పనితీరును ఆయన కొనియాడారు.చదలవాడ సోదరులు వ్యాపార దృక్పథంతో కాకుండా కళలను రక్షించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమనిఅన్నారు.దేశ నాగరికత, కళా,సంగీత,సాహిత్య సంపదను కాపాడుకుంటూ భావితరాలకు అందించి సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతుందని పేర్కొన్నారు. భారతదేశం శక్తివంతంగా తయారైందని ఆధ్యాత్మిక భావనను మరింతపెంపొందించుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత అందరికీ పై ఉందని అన్నారు.చదలవాడ సోదరులు వ్యాపార కాకుండా భావితరాలకు గుర్తించుకునేలాగ విష్ణుమూర్తి రూపొందించటం మహత్తరమైనలను విషయమని వారిని అభినందించారు.
అనురాధ టింబర్ అధినేత చదలవాడ తిరుపతి రావు మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,మా ఐదు సంవత్సరాల శ్రమ తర్వాత దారు శిల్పం రూపు సంతరించుకుంది అని అన్నారు. టేకు బర్మా అరణ్యంలోలభించిన అరుదైన మహా వృక్షాన్ని వేలంపాటలో దక్కించుకొని విశేషమైన మహావిష్ణు రూపంగా మార్చాన మన శిల్పులు భారతదేశం, బర్మా శిల్ప కళాకారులు చేసిన చారిత్రాత్మక శిల్పకళాకాండంగా బావితరాలకు భవ్య రూపముగా తీర్చిదిద్దారు అన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్లా మేరీ కాలేజీ ఫౌండర్ చిన్నమ్మ, సినీగేయ కళాకారుడు,శివ భక్తుడు తనికెళ్ల భరణి ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




