Friday, 6 November 2026

మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు పొందిన వారికే

మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు పొందిన వారికే తిరిగి ఇవ్వడం శోచ నీయం :అఫ్జల్ ఖాన్ : శామీర్ పేట్, జనం సాక్షి :
మంగళవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతు మార్కెట్ కమిటీ బాడీ ని మళ్ళీ పదవులు పొందిన వారే నియమించబడటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. మార్కెట్ కమిటీ బాడీ పూర్తి అయ్యిందంటే కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారేమోననుకున్నానని, అయితే పాత పేర్లే చూసి నివ్వేరపోయినట్లు అఫ్జల్ ఖాన్ తెలిపారు. అడిగే వారు లేక పోతే పరిస్థితులు ఎందాకనైనా మారుతాయని అందుకే కేసిఆర్, కేటిఆర్ లు దీని పై దృష్టి సారించాలని అన్నారు. త్వరలో దీని విషయంలో తమ కార్యచరణ ఉంటుందని, ఎవరు ఏం చేస్తారని తేలిక గా తీసుకుంటే పరిస్థితులు పార్టీ మీద తీవ్ర మైన వ్యతిరేత ఏర్పడుతుందని అఫ్జల్ ఖాన్ తన ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దే క్రమం లో కష్ట పడి పని చేసే కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు.
20 ఎస్పీటీ -1: అఫ్జల్ ఖాన్