అనసూయకు సిపిఐ అశ్వాపురం మండల కమిటీలు ఘన నివాళి.
బూర్గుంపహాడ్ జనవరి 07 (జనంసాక్షి)
సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బొల్లోజు అయోధ్య సతీమణి బొల్లోజు అనసూయ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పరమపదించారు. ఆమె మరణం పట్ల సిపిఐ అశ్వాపురం మండల పార్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. సిపిఐ నాయకులు ఎర్రజెండా కప్పి, పూల మాల వేసి,”అనసుర్య హమారహ్హై” అంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సర్ రెడ్డి పుల్లారెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు, మేలాపుర సురేందర్ రెడ్డి, దంతాల జగదీష్, రాయపూడి రాజేష్, ఈనపేల్లి పవన్ సాయి, ఎడెల్లి కమలాకర్, అక్కిన నరసింహారావు సంతాపం వ్యక్తం చేసి ఘనంగా నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.




