రాజంపేట్ లో తొలిమెట్టు కార్యక్రమం
రాజంపేట్ జనవరి 6 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున మండల విద్య అధికారి ఎంఈఓ రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి తొలిమెట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లింగాల సరూప జడ్పిటిసి కొండ హనుమాన్లు నోడల్ అధికారి సాయి రెడ్డి కాంప్లెక్స్ ఉపాధ్యక్షురాలు నళిని లక్ష్మీనారాయణ హాజరై ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎంపీపీ లింగాల సరూప మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాంగా ప్రవేశపెట్టిన తొలి మెట్టు కార్యక్రమం విజయవంతం చేసి విద్యార్థులకు పూర్తి స్థాయి నాణ్యత మైన విద్యను అందించాలి అని కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతో నష్టపోయారని ఆ నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినుత రీతిలో విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని అన్నారు అనంతరం ఎంఈఓ రామస్వామి మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమాన్ని పత్తి విద్యార్థికి అర్థం అయ్యేలా వివరించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు ఈ కార్యక్రమం వల్ల కరోనా సమయంలో విద్యార్థులు నష్టపోయిన నాలెడ్జ్ ని తిరిగి పొందే గొప్ప అవకాశం అన్నారు అనంతరం జడ్పిటిసి కొండ హనుమాన్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించడం గర్వించ దగా విషయం అని కొనియాడారు కరోనా సమయంలో విద్యార్థులు నష్టపోయిన అయినా విద్యను మళ్లీ తిరిగి అందించాలన్న సకాలంలో అన్ని రకాలుగా వివిధ కార్యక్రమాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు నాయకులు పాల్గొన్నారు




