Wednesday, 4 November 2026

అనాజిపురంలో చెరువుల పండగ

జనం సాక్షి జూన్ 8భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో దశాబ్ద ఉత్సవాలలో భాగంగా గురువారం చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీడీవో నరేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ మైలారం వెంకటేష్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు