Thursday, 5 November 2026

అనాదలకు చేయూత నివ్వాలి :

అనాదలకు చేయూత నివ్వాలి :అఫ్జల్ ఖాన్ : శామీర్ పేట్, జనం సాక్షి :
సమాజం లో అనాదలను ఆదుకోవటం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. ఆదివారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం నాయకులు బుర్క వెంకటేష్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని మాతృ శ్రీ అనాద ఆశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. టీఆర్ఎస్ లో చురుకుగా పని చేసే బుర్క వెంకటేష్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని , ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. సందర్భం ఏదైనా అనాద ఆశ్రమానికి వెళ్ళి అనాథలను ఆదుకోవాలని అఫ్జల్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి,బుర్క వెంకటేష్, మహ్మద్ గౌస్,బుర్క సాయికిరణ్, కార్తిక్, ఆశ్రమ సిబ్బంది సరిత తదితరులు పాల్గొన్నారు.
15ఎస్పీటీ -1: ఆశ్రమం లో పండ్లు పంచుతున్న నాయకులు