అనాధలకు చేయూత నివ్వాలి :అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారం శామీర్ పేట లోని మాతృ శ్రీ అనాద ఆశ్రమం లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అనాదలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు అఫ్జల్ ఖాన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బత్తుల శశికాంత్ యాదవ్, మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి , నిసార్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
24 ఎస్పీటీ -1: అందలకు పండ్లు పంపిణి చేస్తున్న అఫ్జల్ ఖాన్
అనాధలకు చేయూత నివ్వాలి




