Sunday, 8 November 2026

మనుధర్మం మానవ ఎదుగుదలకు చాలా ప్రమాదం

మనుధర్మం మానవ ఎదుగుదలకు చాలా ప్రమాదం
ఝరాసంగం డిసెంబర్ 25( జనం సాక్షి ) భారతదేశంలో మనుధర్మం మానవ ఎదుగుదలకు చాలా ప్రమాదం అని సమతా సైనిక్ దళ్ నాయకులు బాలరాజు అన్నారు. ఆదివారం పొట్టిపల్లి గ్రామంలో కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని కంటే ముందు మానవ ప్రతిభ ఆధారంగా కాకుండా మనుధర్మ శాస్త్ర ప్రకారం చతుర్ వర్ణ వ్యవస్థ పేరుతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశా ఈ మూడు వర్గాలే సబండవర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శ్రమను దోచుకుని ఎలాంటి శ్రమ చేయకుండా బ్రతికిన వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మిగతా 85%
స్త్రీలను, శూద్రులను, పంచములను మను ధర్మం పేరిట నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బడికి గుడికి దూరంగా ఉంచి సబండవర్గాలను కులం పేరుతో నీచమైన కుల వృత్తులను చేయిస్తూ పశువుల కంటే హీనంగా చూసే మనుధర్మం మాకొద్దు అని 1927 డిసెంబర్ 25 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి భారతదేశంలో కులం మతం ప్రాంతం తేడా లేకుండా రాజ్యాంగం ద్వారా సబండ వర్గాలకు హక్కులు కల్పించిన హక్కుల ప్రధాత, అందరివాడు అన్నారు అంబేద్కర్ కు నేడు యావత్ జాతి రుణపడి ఉండాల్సిందే అని మన ధర్మ శాస్త్రం పేరిట దేశ ప్రజల శ్రమను దోచుకుని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ధర్మం పేరు తోటి చేస్తున్న అన్యాలను నిరసిస్తూ రాజ్యాంగం ఎలాంటి కుల మత వర్గ ప్రాంత భేదం లేకుండా అన్ని వర్గాలకు ప్రజలకు హక్కులు కల్పిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది మెదడులలో మనుధర్మ శాస్త్ర సంఖ్యలను తెంచుకోకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా మానవ మెదళ్లకు ఉన్న సంకెళ్లను తెంచుకొని సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములై బంగారు భారతానికి బాటలు వేయాలని సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గుండన్న, ప్రశాంత్, రాజు, రవి, శ్రీనివాస్, శ్రీధర్, చుమ్మా, తదితరులు పాల్గొన్నారు