Thursday, 5 November 2026

అనాధల కోసం రుల ఔదర్యం.

చిన్నాఅనాధల కోసం రుల ఔదర్యం.
ఫొటో : ఆశ్రమంలో నగదు అందజేస్తున్న చిన్నారులు.
నెన్నెల, డిసెంబర్ 9, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని లోటస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని సీసీసీలో గల సాయి అనాధ వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా ₹3434 రూపాయల నగదును అందజేశారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మద్దెర్ల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు కొండపర్తి వెంకటేష్ మాట్లాడుతూ అనాధ వృద్ధుల కోసం చిన్నారి విద్యార్థులు తాము దాచుకున్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఔనత్యాన్ని చాటుకోవడం చాలా అభినందనీయమని, చిన్నతనం నుంచే సేవా గుణం కలిగి ఉండటం గొప్ప విషయమని వారు అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లావణ్య, మౌనిక, గౌతమి, మౌనిక, గీతాంజలి, శారద, అఖిల, నందిని పాల్గొన్నారు.