Thursday, 5 November 2026

దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ పార్టీ కీలక పాత్ర

దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ పార్టీ కీలక పాత్ర

ఎంపీపీ. మూసిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి రెడ్డి

వీణవంక డిసెంబర్ 09 (జనం సాక్షి )
వీణవంక. దేశ రాజకీయాల్లో బి.ఆర్.ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది బి ఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంగా వీణవంక ఎంపీపీ మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పాటుగా సుదీర్ఘ పోరాటం చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు ఆయన నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగిందని అని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో భారత దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ పార్టీ విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టుక పోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వీణవంక మండల ప్రజల పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి తెలిపారు