Wednesday, 4 November 2026

అనాధ చిన్నారులకు పొట్టినరోజు వేడుకలు నిర్వహించిన బాలవికాస సభ్యులు.

..
-డి.ఎమ్&ఎచ్.ఓ.డా.కె.సుధాకర్ లాల్
నాగర్ కర్నూల్ రూరల్ జనవరి25(జనంసాక్షి):
బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనాధ చిన్నారులకు పుట్టిన రోజు వేడుకలను నాగర్ కర్నూల్ పట్టణంలోనీ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు,ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి/రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా.కె.సుధాకర్ లాల్ పాల్గొన్నారు.ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ,బాలవికాస సభ్యులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న 27మంది అనాధ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసి,వారికీ కేక్ తినిపించి,ఆశీర్వదించారు,చిన్నారులు అందరూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రణాళిక బద్దంగా ఇష్టపడి చదవాలని ఆకాంక్షించారు,వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన బాలవికాస సంస్థ సభ్యుల సేవలు అబినందనియమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్,జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరి సి.రమేష్ రెడ్డి,బాలవికాస సంస్థ సభ్యులు శోభ,కల్యాణి,రామేశ్వరి,మరియు బాలవికాస మహిళ సభ్యులు ఐదు వందల మంది పాల్గొన్నారు.