టేకులపల్లి, జనవరి 25 (జనవరి సాక్షి ): మండలంలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గర్భిణీలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలు, పిల్లలకు తప్పకుండా అందించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ రాజేందర్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చుo అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వరలక్ష్మి, అంగన్వాడి టీచర్ అనసూర్య, ఆశవర్కర్ కళావతి, మహిళలు పాల్గొన్నారు.




