Saturday, 7 November 2026

అనారోగ్యంతో మృతి చెందిన కేషబోయిన కమలాకర్

అనారోగ్యంతో మృతి చెందిన కేషబోయిన కమలాకర్

పూలమాల వేసి నివాళ్లు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,సర్పంచ్ తూటి పావని రమేష్

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని అక్కల్ చెడ గ్రామానికి చెందిన కేషబోయిన కమలాకర్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.విషయాన్ని తెలుసుకున్న మండల అద్యక్షులు గోపాల్ నాయక్,గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యకయ్య గౌడ్ లు స్థానిక నాయకులతో కలిసి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు.వీరి వెంట మండల పార్టీ ఉపద్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్,మాజీ ఎంపీటీసీ బిల్లా ఇంద్రసేన రెడ్డి,మైనారిటీ సెల్ మండల అద్యక్షులు అమీరొద్దీన్,గ్రామ పార్టీ అధ్యక్షులు పులిశెరు రాజేందర్,ఉప సర్పంచ్ వీరన్న, గ్రామ పార్టీ ఉపాద్యక్షులు బోనగిరి స్వామి,మాజీ అధ్యక్షులు బోనగిరి సారయ్య,బొడిగ శ్రీను,వీరు నాయక్,ముత్యం భద్రయ్య,పెద్దమ్మల రాజేందర్,ఈర్ల శ్రీను,ఆకుల అశోక్,బాలాజీ,చందర్,మాలోత్ పూల్ సింగ్,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చిలుక రామక్క,కరెడ్ల శివ,బాబు,తేజవత్ శివ,సతిష్,హాయజ్,ధోని రాజు,గొడిశాల రాజు,వీరన్న,సారయ్య తదితరులు ఉన్నారు.