Saturday, 7 November 2026

శ్రీదత్తగిరి సందర్శించిన శివకుమార్

శ్రీదత్తగిరి సందర్శించిన శివకుమార్
ఝరాసంగం నవంబర్ 27 (జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాధితున బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ సందర్శించారు, జ్యోతిర్లింగాల, శ్రీ దత్తాత్రేయ స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం వారికి పీఠాధిపతులు శ్రీ 108 వైరాగ్య అవధూత గిరి మహారాజ్, ఆశ్రమ ఉత్తరాధికారి డాక్టర్ సిద్దేశ్వర మహారాజ్ పూలమాలశాలలతో సన్మానించారు, అనంతరం ఆశ్రమంలో 30వ తేదీ నుండి జరగనున్న దత్తగిరి మహారాజ్ శతజయంతి, శ్రీ దత్త జయంతి ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివలక్ష్మి కృష్ణ, తెరాస నాయకులు వెంకటేశం, నరసింహ గౌడ్, ఉన్నారు.