గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వం
— మాజి ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
మోత్కూరు నవంబర్ 27 జనంసాక్షి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడ్జెట్లో క్రమంగా నిధులు తగ్గిస్తూ పధకాన్ని ఎత్తివేసే కుట్రచేస్తుందని మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం రోజున అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలు మోత్కూర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదికారం లోకి వచ్చిన నుండి ఉపాధి హామీ పధకానికి నిధుల కోత విదిస్తుందని విమర్శించారు. ఈ మహాసభలో ముఖ్య వక్తగా పాల్గొన్న వ్యకాస రాష్ట్ర అద్యక్షులు నాగయ్య గారు మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు వేతనము 600 రూపాయలు ఇవ్వాలని,పట్టణ ప్రజలకు ఉపాధి హామీ పధకం వర్తింపజేయాలని,కూలీల వాటాను 90 శాతానికి పెంచి మెటీరియల్ కాంఫోనెంట్ 10 శాతం తగ్గించాలని,ఉపాది హామీ లో యంత్రాలను,కాంట్రాక్టర్లను నిషేధించాలని,అడిగిన అందరికీ పని వారం వారం వేతనాలు, మెడికల్ కిట్టు, ఫే స్లీప్ లు మరియు పనిముట్లు ,టెంట్లు మంజూరు చేయాలని, మహిళలకు,వికలాంగులకు చేయగలిగిన పనులు అప్పగించాలని,పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి మేట్లుకు,సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నాగయ్యగారు డిమాండ్ చేశారు. ఈ మహాసభకు ముందుగా వ్యవసాయ కూలీ రాచకొండ రాములమ్మ జెండా ఆవిష్కరించారు.ఈ మహాసభకు అద్యక్ష వర్గం గా రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు గంగాదేవి సైదులు,మామిడి స్వరూప లు వహించగా ఈ మహాసభలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ,ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండి జహంగీర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, వ్యకాస జిల్లా ఉపాద్యక్షులు జెల్లెల్ల పెంటయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు జూకంటి పౌల్, ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, సల్లూరి కుమార్, సిర్పంగి స్వామి,గుంటొజి శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య,వేముల సైదులు,కొండాపురం యాదగిరి,వల్లంపట్ల శ్రీనివాసరావు,దొడ్డి బిక్షపతి, ఎర్ర ఊషయ్య పాల్గొన్నారు.




