Wednesday, 4 November 2026

అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట డిఐఈఓ జానపాటి కృష్ణయ్య , ప్రముఖ వైద్యులు రామ్మూర్తి యాదవ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని సుమంగళీ ఫంక్షన్ హాల్ లో జరిగిన శ్రీనిధి జూనియర్ కళాశాల 13వ వార్షికోత్సవ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ అమూల్యమైందని , ఈ దశలోనే భవిష్యత్ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపుతిప్పే కళాశాల స్థాయి చదువును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం దక్కుతుందన్నారు.ప్రతి విద్యార్థి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.అనంతరం ఐపీఈ -2022లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన సమీనా , సౌక్య లకు చెరో రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతిని డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అందజేశారు.అదేవిధంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటి, ఎన్ఐటి , నీట్ లలో సీట్లు పొందే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఆయన ప్రకటించారు.విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ వేడుకల్లో కళాశాల కరస్పాండెంట్ యాదవ రెడ్డి , ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి , కళాశాల డైరెక్టర్లు పరుశురాం, మల్లారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.