Wednesday, 4 November 2026

దోమకొండ కోటలో తెలంగాణ ఉర్దూ సాహిత్యా కార్యక్రమం..

 

 

 

 

సంస్కృతి, సంస్కారం, సాహిత్యం, ముఖ్యం..- రిటైర్డ్ ఐపీఎస్ తెలంగాణ సలహదారు ఏకే ఖాన్
కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి11 (జనంసాక్షి);కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శనివారం కోట ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్యానికి దోమకొండ సంస్థానం వారి అద్వర్యంలొ ఉర్దూ సాహిత్యానికి అందించిన సేవ ముఖ్యంగా వారసులు రాజరాజేశ్వర రావు ఆరు భాషలలో తెలంగాణ సాహిత్యానికి అందించిన సేవలపై వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం అడ్విసర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏకే ఖాన్ మాట్లాడుతూ, దోమకొండ కోట లో పునరుద్దించడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా చాలా ముఖ్యమని ఎందుకంటే తెలంగాణలో ఎన్నో సంస్థానాలు ఉన్నాయి వాటిని పునరుద్దించాలని తెలంగాణ సంస్కృతిని పునరుద్దించడం చేయాలంటే దోమకొండ కోటలో జరుగుతున్న పని సక్సెస్ కావడం చాలా ముఖ్యం మని సంస్కృతి, సంస్కారం, సాహిత్యం, ఈ మూడింటి ద్వారా డెవలప్మెంట్ త్వరగా అయ్యే అవకాశం ఉంటుందనితెలిపారు.ఈ కార్యక్రమంలో మొట వారసులు కామినేని అనిల్ కుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, జడ్పిటిసి తిరుమల గౌడ్, కొట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.