తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 11 (జనంసాక్షి):తిరుమలగిరి పెద్ద చెరువు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడిగా పిట్టల కృష్ణ ఎన్నికయ్యాడు.శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన 9 మంది డైరెక్టర్లు ఒకే ప్యానల్ కు సంబంధించి ఉండడంతో అధ్యక్షుని ఎన్నిక సాఫీగా సాగింది. ఉపాధ్యక్షుని గా నీరుటి తిరుమలయ్య,ప్రధాన కార్యదర్శిగా పిడిగం ఎల్లోజి,కోశాధికారిగా కటికర్ల మల్లయ్య ను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.డైరెక్టర్లుగా కూర వీరమ్మ,పిట్టల ఎల్లమ్మ, పిట్టల తిరుమల్,చంద్రవంక సైదులు,నీరుటి రవి కి ఎలక్షన్ అధికారి షణ్ముఖ చారి నియామక పత్రాలను అందజేశారు.అనంతరం ముదిరాజ్ యువకులు ఏర్పాటు చేసిన ముదిరాజ్ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా పిట్టల కృష్ణ మాట్లాడుతూ తిరుమలగిరి మత్స్య సహకార సంఘం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.అందరి సహకారాలతో మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇచ్చారు.తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.




