Friday, 6 November 2026

అనుమతిలేని బైంసా సభకు” బండి”వెళ్లడం విరుద్ధం

అనుమతిలేని బైంసా సభకు” బండి”వెళ్లడం విరుద్ధం

ప్రశాంతమైన జగిత్యాలలో చిచ్చుపెట్టే చర్య

అభివృద్ధికి ఇదో ఆటంకమే

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల, నవంబర్ 28: సున్నితప్రాంతమైన బైంసాలో బండి సంజయ్ సభతో ఉద్రేకాలు పెరుగుతాయని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అయినా అక్కడికి బండి సంజయ్ పోయే ప్రయత్నం విరుద్ధమైన చర్య అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాకు వీడియో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సమస్య రహిత ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర లకు ప్రభుత్వం, పోలీసుశాఖ అనుమతి ఇచ్చిందన్నారు. కానీ బైంసా రాష్ట్రంలోనే అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతంగా మిగిలిందన్నారు. ప్రభుత్వం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొలిపేందుకు నిరంతర చర్యలను చేపడుతోందన్నారు. అక్కడి పరిస్థితులు, బిజెపి సభ తో రాష్ట్రంలోని ప్రశాంత వాతవరనానికి భంగం కలుగుతోందని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించారని అన్నారు. అయినా అక్కడ సభ నిర్వహిస్తామని మొండికేసి పోయే ప్రయత్నం లోనే పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. దీనికితోడు జగిత్యాల పరిధిలో అరెస్ట్ చేయడం తో ఇక్కడి ప్రశాంత వాతావరణం కాస్తా వేడెక్కిపోయిందన్నారు. బిజెపి నాయకత్వం, కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రవర్తన, మాటలతో కయ్యం పెట్టె ఆలోచనల్లో భాగమేనని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల అభివృద్ధికి కేరాఫ్ గా నిలిచిన జగిత్యాల నియోజకవర్గములో అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పర్యటనలో జరిగిన వివాదాలు, రెచ్చగొట్టే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.