బైంసాకు బయలుదేరిన ఎంపీ బండి సంజయ్*
*ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపు అడేల్లి పోచమ్మ నుండి ప్రారంభం*
మెట్పల్లి టౌన్, నవంబర్ 28,
జనం సాక్షి:
హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కరీంనగర్ నుండి ఆడేల్లి పోచమ్మ ఆలయానికి జిల్లా అధ్యక్షులు మొరపెళ్లి సత్యనారాయణ తో కలిసి బయల్దేరిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
ఐదో విడత ప్రజా సంఘమయాత్ర రేపు ప్రారంభిస్తారు. బండి సంజయ్ ని మెట్ పల్లి లోని మాజీ ఎమ్మెల్యే దాము ఇంటి వద్ద బీజేపీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ మరియు అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ , పార్లమెంట్ కో కన్వీనర్ సదాశివ్, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్, జెయన్ సునీత వెంకట్, ఇళ్లేందుల శ్రీనివాస్, ఇల్లెందుల కృష్ణమాచారి జిల్లా బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్, జిల్లా బీజేవైయం అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, కుడుకల రఘు, రాజపల్ రెడ్డి, ముద్దం సత్యనారాయణ, పిసు రాజేందర్, జయకృష్ణ, బోడ్ల నగేష్, మద్దెల లావణ్య, ఆర్మూర్ రంజిత్, రమేష్ యాదవ్, నరేందర్ రెడ్డి, బోడ్ల గౌతమ్, బోడ్ల ఆనంద్, కలికోట శ్రీకాంత్, భీమనతి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బైంసాకు బయలుదేరిన ఎంపీ బండి సంజయ్




