అనుమతి ఉన్న ఎరువులు మాత్రమే అమ్మాలి
ఏడిఏ సంగీతలక్ష్మి
మల్దకల్ డిసెంబర్ 29 (జనంసాక్షి) జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం రైతు వేదిక భవనంలో మల్దకల్, గట్టు మండలాల ఫర్టిలైజర్, పెస్టిసైడ్ సీడ్స్ డీలర్లుకు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ సంగీతలక్ష్మి హాజరై మాట్లాడుతూఎరువులఎమ్మార్పీ ధరలకు మాత్రమే అమ్మాలి అధిక ధరలకు అమ్ముతే కఠిన చర్యలు తీసుకోబడును. అనుమతి ఉన్న ఎరువులను మాత్రమే అమ్మాలి,స్టౌక్ రిజిస్టర్ మైంటైన్ చెయ్యాలి,కోర్టు అనుమతి పొందిన బయోలు మాత్రమే అమ్మాలని,వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతు ముఖ్యంగా పీఎం కిసాన్ ఈకెవైసి రైతులకు చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి.రాజశేఖర్, హెచ్.హనుమంత్ రెడ్డి ,ఏఈఓలు డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.




