బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఝరాసంగం డిసెంబర్ 29 (జనం సాక్షి) బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని డీసీసీబి బ్యాంకు మేనేజర్ వెంకటేశం అన్నారు. గురువారం మండల పరిధిలోని కమాల్ పల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లో పొదుపు చేసే ప్రతి పైసా రేపటి మన భవిష్యత్ కు భరోసా అన్నారు.సహకార డిపాజిట్ పథకం లో చేరి ఆర్థికంగా అభివృద్ధి చెందలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపూర్ణ సంగ్రామ్ పాటిల్, ఎంపిటిసి మారుతీ రావు పాటిల్, రైతు సమన్వయ అధ్యక్షులు సుభాష్ రావు పాటిల్, గ్రామ పెద్దలు విజయ్ పాటిల్ అశోక్ రావు టి. పాండు,పంచాయతీ కార్యదర్శి నవిద్, సొసైటీ సి ఈ ఓ నిస్సార్ హైమద్ తదితరులు పాల్గొన్నారు
బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి




