మాజీ మంత్రి కి ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ డిసెంబర్ 29( జనం సాక్షి) మాజీ మంత్రి, ఎమ్మెల్సీ దివంగత మొహమ్మద్ ఫరీదుద్దిన్ మొదటి వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణం లోని అతిధి గృహం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొహమ్మద్ ఫరీదుద్దిన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెదక్ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మంకల్ సుభాష్ పాల్గొన్నారు.
అదేవిధంగా అల్గోల్ ఎక్స్ రోడ్ లో జుబేర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ జెడ్పిటిసి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు మరియు శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కి ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు




