Wednesday, 4 November 2026

అనుమతి లేకుండా టేకు నిల్వ

అనుమతి లేకుండా టేకు నిల్వ…
నమోదు చేసిన ఎఫ్ఆర్ఓ…
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 15
ప్రభుత్వ అనుమతి లేకుండ శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో నిల్వ ఉంచిన టేకు దుంగలు, ఫారెస్ట్ అధికారులు యజమానిపై గురువారం కేసు నమోదు చేసినట్లు రేంజ్ ఆఫీసర్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రాజేశ్వరరావు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో కె దామోదర్ ,మహేందర్, అనే ఇద్దరు అన్నదమ్ములు నడిపిస్తున్న దూగడ మెషిన్ లో ప్రభుత్వ అనుమతిలేకుండ టేకు దుంగలు నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీ చేయగా సుమారు 20వేల రూపాయల విలువ గల టేకు దుంగలు, కటింగ్ ముక్కలు, ఉన్నాయని, మిల్లు యజమానులను టేకు కర్రల అనుమతులను అడగగా యజమానులు ఎలాంటి అనుమతిపత్తులు చూపకపోవడంతో దామోదర్, మహేందర్ పై అటవీశాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో శంకరపట్నం సెక్షన్ ఆఫీసర్ సరిత, ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.