Thursday, 5 November 2026

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మీసేవ కేంద్రాన్ని మూసివేసిన జిల్లా అధికారులు

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మీసేవ కేంద్రాన్ని మూసివేసిన జిల్లా అధికారులు
తిరుమలగిరి (సాగర్ )జనవరి 13 (జనంసాక్షి) :మండల కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మీసేవ కేంద్రాన్ని ,మీసేవ జిల్లా మేనేజర్ కత్తుల గౌతం శుక్రవారం మూసి వేయించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల ఎటువంటి అనుమతులు లేకుండా మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం పక్కన కోటేష్ మీసేవ ధరణి సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు . ఇట్టి సెంటర్ ను శుక్రవారం ఆయన తిరుమలగిరి గిర్దావర్ నాగరాజు తో కలిసి ప్రాథమికంగా తనిఖీ చేసి ,ఇది మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి మంజూరైన మీ సేవ గా గుర్తించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆపరేటర్ లాగిన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని , ఈ సెంటర్ ఐడిTS-RFNG027 నీ బ్లాక్ చేసి అక్కడ ఉన్న మీ సేవకు సంబంధించిన స్టేషనరీ ని స్వాధీనపరచుకున్నామని ఆయన తెలిపారు. ఆర్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని ఆయన తెలిపారు.