కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రామడుగు లక్ష్మణ్
సిపిఐ జిల్లా కార్యదర్శి
ఈరోజు మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈనెల 10 11న హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మగ్దూం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి ఈనెల 22వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జిల్లా సమితి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది అని వారు అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో పార్టీ ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని గ్రామ గ్రామాన పార్టీ విస్తరణ జరగాలని సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందే అంతవరకు సిపిఐ ప్రజా ఉద్యమాలు చేయాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని విద్యా వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమలు స్థాపించి భూగర్భ గనులు స్థాపించి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఓటు హక్కును నికార్సుగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటుకు నోటు అనే నినాదంతో వచ్చే నాయకులను తరిమికొట్టాలని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఓపెన్ కాస్ట్ వలన ఆ ప్రాంతంలో నష్టపోయినటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేషనల్ హైవే 363 రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలని రోడ్లు పూర్తిస్థాయిలో అయిపోయిన తర్వాతనే మందమారి కేకే ఓసి వద్ద ఏర్పాటుచేసిన టోల్ ప్లాజా వద్ద వసూలు నిలిపివేయాలని సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి కార్మిక సమస్యలు పరిష్కరించాలని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికలలో సిపిఐ పార్టీని ఆదరించాలని కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను కోరారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద కలెక్టరేట్ కార్యాలయం వద్ద రాజభవన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది పార్టీని మరింత బలోపేతం చేయడానికి సోషల్ మీడియా కమిటీలు జనసేవ దళ్ ఏర్పాటు రాజకీయ శిక్షణ తరగతులు పోలింగ్ బూత్ ఏజెంట్ల నియమకం ఈనెల 26న జరుగు గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని జాతీయ పార్టీ పిలుపు ఇవ్వడం జరిగినది భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగినది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్
నియోజకవర్గ కార్యదర్శి
మిట్టపల్లి పౌల్
జిల్లా సమితి సభ్యులు
వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య
సిపిఐ ప్రజా సంఘాల నాయకులు
బండారి రాజేశం, జెట్టి మల్లయ్య ఆథోనీ దినేష్ ఎగుడ మొండి, మోతే రాజలింగు మారపల్లి రవి ,తాళ్ల పెళ్లి వీరన్న, గడ్డం సంతోష్ బొడ్డు పెళ్లి కుమార్, కొప్పుల సంజీవ్
తదితరులు పాల్గొన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి




