Thursday, 5 November 2026

అనుమతులు లేకుండా నీళ్లు తొలగింపు

:అనుమతులు లేకుండా నీళ్లు తొలగింపు

లక్ష రూపాయల చేప పిల్లలు హుష్ కాకి

సత్తుపల్లి అర్ సి డిసెంబర్ 15(జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరువుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించి రైతు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు కృషి చేసింది. ఒక్క చుక్క నీరు వృధా కాకుండా ఉండేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంది రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ప్రభుత్వం ఎంతగానో వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. వర్షపు చుక్క పడ్డ చెరువులకు వెళ్ళేటట్టు ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం చెరువులు పునరుద్దించారు ఎప్పుడు నిండుకుండలా కళకళలాడాలని ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నారు. కానీ కొంతమంది అధికారులు మూలంగా ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే విధంగా వారి పనులు ఉంటున్నాయి. ప్రజలు కట్టే పన్నుల చేత లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ పనులలో జవాబుదారితనం లేకుండా పనిచేయటం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. మత్స్యశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు వారి యొక్క కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందేoదుకు ప్రభుత్వం 100% రాయితీతో ఉచిత చేప పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందో ఆ లక్ష్యం దెబ్బతినకుండా దాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే, బాధ్యతాయుతంగా పనిచేయవలసిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం వలన ప్రజాధనం నీటిపాలవుతుంది.కాటూరు చెరువులో అక్రమంగా నీళ్లు తొలగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాటూరు చెరువుపై ప్రత్యేక కథనం! కల్లూరు మండలంలో కొర్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల కాటూరు చెరువు( పెద్ద చెరువు) ఎక్కువ విస్తీర్ణం కలిగి వందల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది రైతులు పంట పొలాలకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చెరువు ఎప్పుడూ నిండుకుండలా