Thursday, 5 November 2026

హత్యయత్నం కేసులో శిక్ష

హత్యయత్నం కేసులో శిక్ష.
ఫొటో : నిందితుడు రాజేశం.
నెన్నెల, డిసెంబర్ 15, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రానికి చెందిన పొట్లపల్లి రాజేశం అనే వ్యక్తికి హత్యయత్నం కేసులో 18 నెలల కఠిన కారాగారా శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 28న నెన్నెల గ్రామానికి చెందిన తోట మల్లు అనే మహిళ ఇంట్లో అర్ధరాత్రి చొరబడి కొడవలితో చంపడానికి ప్రయత్నించినట్లు బాధితురాలు పిర్యాదు చేయగా అప్పటి ఎస్ హెచ్ ఓ రాజేశ్వర్ కేసు నమోదు చేయగా, ఎస్సై సౌమ్య పరిశోదన ప్రారంభించి, విచారణ చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారని వివరించారు. తదుపరి పరిశోదన పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్ గురువారం వాడోపవాదాలు విన్న తర్వాత, సాక్షుల వాదనలు నిందితునికి 18 నెలల కఠిన కారాగారా శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారాని తెలిపారు. నేరస్తునికి శిక్ష పడటానికి సహకరించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మదన్ మోహన్ రావు, సాక్షులను ప్రవేశ పెట్టడానికి సహకరించిన ఎస్సై రాజశేఖర్, బెల్లంపల్లి రూరల్ సీఐ బాబురావు, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ను, లైజన్ ఆఫీసర్లు మరియన్ రాజు, గులాం దస్తగిరి, కోర్టు కానిస్టేబుల్ రహీముద్దీన్, ప్రాసిక్యూషన్ బృందానికి రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు.