అనుమతులు లేని అక్రమ వెంచర్ పనులను ఆపివేయాలి అలంపూర్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు అలంపూర్ జనంసాక్షి (జనవరి 11)అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సోమ సిద్దేశ్వర ఆలయం కొండారెడ్డి ఆలయం ప్రాంగణంలో అనుమతి లేకుండానే అలంపూర్ గ్రీన్ సిటీ పేరుతో వెంచర్ లో జరుగుతున్న పనులను ఆపివేలని బుధవారం పురవస్తు శాఖ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ మనోరమా, కమిషనర్ నిత్యానందుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పూర్వస్తూ శాఖ సిబ్బంది గతంలో
శ్రీశైలం ప్రాజెక్టు నీటి మునుకలో గొంది మల్ల సమీపంలో వేదవతి నది కలిసే చోటు తీర్థ ఘట్టంలో ఒకటైన సోమసిద్దేశ్వర ఆలయం ముప్పునకి గురి కాకుండా రాష్ట్ర పురావస్తు శాఖ వారు అలంపూర్ శివారులోని సర్వేనెంబర్ 567 నీటి మునక స్థలంలో పాపనాసిని దేవాలయం సమీపంలో పునర్నిర్మానం చేయడం జరిగింది. అట్టి స్థలంలో ప్రస్తుతం పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా అక్రమంగా దిమ్మెలు పాతి దేవాలయం కు దారి లేకుండా ప్లాట్లు వేస్తున్నారు. ఆ స్థలం హద్దులు గుర్తించి పరిరక్షించాలని పురపాలక చైర్మన్ మనోరమ వెంకటేశ్వర్లు కమిషనర్ నిత్యానందం కి రాష్ట్ర పురావస్తు శాఖ సిబ్బంది ఫిర్యాదు చేసి, వారి దృష్టికి తీసుకెళ్లారు.
అనుమతులు లేని అక్రమ వెంచర్ పనులను




