Thursday, 5 November 2026

జర్నలిస్టు వెంకటేష్ ను పరామర్శించిన కొడిదెల.

జర్నలిస్టు వెంకటేష్ ను పరామర్శించిన కొడిదెల.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 11(జనంసాక్షి):
గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో ఈవినింగ్ దినపత్రిక జిల్లా ప్రతినిధి గా పనిచేస్తున్న వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కొడిదెల రాము బుధవారం సాయంత్రం ఆయన స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకొని సమాజానికి ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మిత్రులు బాలాజీ బిల్లకంటి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.