Wednesday, 4 November 2026

అనుమానస్పద మృతి చేగుంట ఉమ్మడి మండలం.మాసాయిపేట గ్రామనివాసి

 

 

 

 

 

చేగుంట.మాసాయిపేట రిపోర్టర్ జనం సాక్షి మే 8చేగుంట ఉమ్మడి మండలం మాసాయిపేట మండలం కేంద్రంలోని క్వారీలో పడి మాసాయిపేట గ్రామ నివాసి పల్లపు మల్లేష్ (46)మృతి చెందాడు ఆదివారం నాడు మాసాయిపేట మండలం కేంద్రానికి చెందిన మల్లేష్ గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సందర్భంగా చేపలు పట్టేందుకు వలలు కట్టినట్లు స్థానికులు అక్కడున్న రైతులు తెలిపారు ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నీటిలో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు ఆదివారం నాడు దారి పక్కన పోయే వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అనంతరం పోలీసులు క్వారీలో నుండి మృతుని వడ్డేర, పల్లపు మల్లేష్ ను బయటకు తీసి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.