Wednesday, 4 November 2026

క్రీడా విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కమిషనర్ జీవన్ లాల్

 

 

 

 

 

జూలూరుపాడు, మే 8, జనంసాక్షి:గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ప్రతిభను కనబరచి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆదాయపన్ను శాఖ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ యువకులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో కమిషనర్ జీవన్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ లాల్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఓటమిని మరో గెలుపుకు తొలి మెట్టుగా భావించాలని క్రీడాకారులకు సూచించారు. గెలుపొందిన జట్లకు తెలంగాణ రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్, బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు చేతులు మీదుగా షీల్డ్ లు, మెమోంటోలు అందజేసారు. అత్యంత ప్రతిభను చూపిన విజేతలను అభినందించారు. క్రికెట్ టోర్నీలో మొదటి స్థానంలో నిలిచిన మణుగూరు క్రికెట్ జట్టుకు రూ 75 వేలు నగదు, రెండో స్థానంలో విజేతగా నిలిచిన జూలూరుపాడు క్రికెట్ జట్టుకు రూ50 వేలు నగదు బహుమతితో పాటు మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రంజిత్ కుమార్, ఎంపిపి లావుడియా సోనీ, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్, రాష్ట్ర జేఏసీ చీఫ్ అడ్వైజర్ రమేష్, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ యదళ్లపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.