Thursday, 5 November 2026

అన్నదాతలకు ఆసరా.. కోడెదూడల పంపిణీ..

 

డోర్నకల్ ప్రతినిధి జనవరి 19 జనం సాక్షి

శివ పార్వతి .గోశాల ఆధ్వర్యంలో గ్రామం మధు తాండ రూప్లా తండామండలం నర్సింహులపేట పరిధిలో. రైతులకు . తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ చేతుల మీదుగా రైతులకు ఉచితంగా 10 మంది రైతులకు 20. కోడెదూడలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్
మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి రైతు వెన్నెముక. అలాంటి రైతు వ్యవసాయ రంగంలో ఆదుకోవడం భరోసా కల్పించడం రైతుకు పశుసంపదను అందించడం కంటే ఇక గొప్ప సంపదలేదని
రైతులు గోవులను పెంచడం వలన వాటి నుండి వచ్చే పేడ మూత్రం ద్వారా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించుకుని అధికమైన దిగుబడులు పొందవచ్చు అని మరియు ఫెస్టిసైడ్స్ వాడడం వలన భూమి సారవంతం దెబ్బతిని రానున్న భవిష్యత్ తరాలకు విషపూరితమైన నేలను అందించిన వారమవుతామని ఆయన పిలుపునిచ్చారు
జనగామ జిల్లాలో గాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేకచోట్ల రైతులకు ఉచితంగా కోడెదూడలు పంపిణీ చేస్తున్నాము
ఇంకా మీ బంధువుల్లో గాని మీకు తెలిసిన వారు రైతులకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. మహేష్ అగర్వాల్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో. తెలంగాణ గోశాల ప్రదర్శన రాష్ట్ర అధ్యక్షులు గాడి పల్లి రాజేశ్వరరావు తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. కములేకర అరవింద్. సూపర్డెంట్ దుర్గం రోజా. గోరక్ష సమితి ఏదుకొండ రామ్ గ్రామ సర్పంచ్ . లక్ష్మీలక్ష్మణ్ నాయక్. మరియు గోశాల ప్రతినిధులు సుధాకర్ నాయక్
గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు