Thursday, 5 November 2026

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియజేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్ట్ పని చేస్తుందని ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు.గురువారం సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో జిల్లా కేంద్రానికి చెందిన ఉడుతల మల్లయ్య, సైదమ్మ కుమారై వివాహా నిమిత్తం దాతలు మిర్యాల శివకుమార్, కవిత ఆర్థిక సహకారంతో మంగళసూత్రం, మట్టెలు అందజేసి మాట్లాడారు.వామనాశ్రమ మహాస్వామీజీ ఆశీర్వాదంతో ఆ ట్రస్ట్ అధ్యక్షులు సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణలో దాతల సహకారంతో ఇప్పటి వరకు 80 మందికి పుస్తెలు,మట్టెలు అందజేశామని
తెలిపారు.సూర్యాపేట జిల్లాలో 47 మందికి పుస్తె , మట్టెలతో పాటు నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు తాళ్లపల్లి రామయ్య , ఈగా విజయలక్ష్మి , మొలుగూరి పద్మావతి , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.