Thursday, 5 November 2026

రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆత్మ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి

హసన్పర్తి/జనంసాక్షి, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచిత
వైద్యం అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆత్మ మార్కెట్ చైర్మన్ వీసం సురేందర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హసన్పర్తి మండలం 66వ డివిజన్ గంటూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆత్మ మార్కెట్ కమిటీ చైర్మన్ వీసం సురేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల్లో ఆమలు చేయాలని దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల ప్రభుత్వ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.