Tuesday, 3 November 2026

అన్నదాతలు అధైర్యపడొద్దుఆర్ ఐ  నజీర్

 

 

 

 

 

 

 

 

రుద్రుర్ (జనంసాక్షి):రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది. రైతులకు పరిస్థితిలను తెలుసుకోవడానికి శనివారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని ఆర్ ఐ  నజీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని మెరక ప్రాంతం లేక రోడ్డు సమీపంలోకి చేర్చి బరకాలపై ఆరబెట్టుకోవాలని సూచించారు.  ఆరబెట్టిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలు ఏర్పాటు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే మండల స్థాయి సిబ్బంది రైతు వరి పంట క్షేత్రాలలో పర్యటిస్తూ తడిసిన ధాన్యం రాశులను పరిస్థితిని గమనించి సహాయక చర్యలు ముమ్మరం చేశారని స్పష్టం చేశారు