Monday, 2 November 2026

కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ జన్మదినం సందర్భంగా శనివారం పుష్పగుచ్చాన్ని అందజేసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్ట మధు తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి లు కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.