Thursday, 5 November 2026

అన్నదానం కోసం జడ్పీటీసీ 50 వేల విరాళం

అన్నదానం కోసం జడ్పీటీసీ 50 వేల విరాళం
జహీరాబాద్ (జనంసాక్షి)న్యాల్కల్ మండలం,మల్గి గ్రామంలోని శ్రీనవనాథ సిద్దలింగేశ్వరా ఆలయంలో నిర్వహించిన’సప్తాహ మహోత్సవ కార్యక్రమం’అన్నదానం కోసం తనవంతు సహాయంగా 50 వేల రూపాయల పది క్వింటాల్ బియ్యం అందచేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ఒక మారుమూల ప్రాంతంలో ఏడు రోజులు జరిగే సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామసర్పంచ్, ఆలయ కమిటీ బృందానికి అభివందనలు తెలుపుతూ .రాబోయే రోజుల్లో అందరి సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి నావంతుగా కృషి చేస్తానని తెలిపారు.అందులో భాగంగానే ఏడు రోజులు నిర్వహించే సప్తాహ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తుల కోసం అన్నదానం చేస్తున్నట్లు జడ్పీటీసీ స్వప్నభాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ,మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,ఎంపీటీసీ శ్రీపతి,సర్పంచ్ లు రవికుమార్,శేఖర్ రెడ్డి,మండల సీనియర్ నాయకులు బస్వారాజ్ పాటిల్,రాజేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ అశోక్,అధ్యక్షులు సిద్ధారెడ్డి,సంగమేష్,వడ్డీ రవి, డైరెక్టర్ రాజు,శివరాజ్,భద్రుస్వామి, బస్వారాజ్ తదితరులు పాల్గొన్నారు