Thursday, 5 November 2026

నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..
– సిఐటియు జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.
ఊరుకొండ, నవంబర్ 20 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 26 27 తేదీలలో నిర్వహించే తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాల్గవ రాష్ట్ర మహాసభలకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం
ఊరుకొండ మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించి కార్మికులను కలుసుకొని నాలుగవ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని, ఎనిమిది గంటల పని దినాలను అమలు చేస్తూ.. ఆదివారం మరియు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని కోరారు. మహా సభల సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ ప్రదర్శన.. బహిరంగ సభ ఉంటుందని ఈ సభలకు జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతి రెడ్డి హాజరవుతారని కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని గుండ్లగుంటపల్లి, నర్సంపల్లి, ఊరుకొండపేట, ఊరుకొండ, ముచ్చర్లపల్లి, రామ్ రెడ్డి పల్లి, జగబోయిన్ పల్లి, బొమ్మరాసిపల్లి, తిమ్మన్నపల్లి, ఇప్పపాడు తదితర గ్రామాలలో తిరిగి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఊరుకొండ మండల అధ్యక్షులు గెడ్డు ఆంజనేయులు, చంద్రయ్య, జంగయ్య, తిరుపతమ్మ, వెంకటయ్య, కెవిపిఎస్ కడారి ఆంజనేయులు పాల్గొన్నారు.