బెల్లంపల్లి, జులై 6, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. ప్రతి వారం అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో కూలీలకు, నిరుపేదలకు సుమారు 200 మందికి అన్నదానం చేస్తున్న హనుమండ్ల మధుకర్ సేవలను గుర్తించి గురువారం జియో కంపెనీ వారు మొబైల్ ఫోన్ బహుకరించారు. అన్నదాన కార్యక్రమ సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు ఠాకూర్ సంతోష్ సింగ్, జియో జేసీఎం నయిం, ఎంఎల్ కరుణాకర్, బెల్లంపల్లి డిస్ట్రిబ్యూటర్ అట్టె సత్యనారాయణ, జియో ఫైనాన్స్ వెంకటేష్ పాల్గొన్నారు.
అన్నదానం సేవలకు చిరు బహుమానం.




