శామీర్ పేట్, జనం సాక్షి :
బుధవారం రాత్రి శామీర్ పేట లోని సయ్యద్ జలాలుద్దీన్ ముల్తానీ బాబా దర్గ్హా లో ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నగరం నుండి వచ్చిన సందల్ కు ఘన స్వాగతం పలికారు. వారికి పూల మాలలతో సత్కరించారు. అనంతరం పెద్ద చెరువు వద్ద గల శామీర్ ఔలియా దర్గ్హా వద్ద సందల్ తో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం . సయ్యద్ జలాలుద్దీన్ ముల్తానీ బాబా దర్గ్హా లో సందల్ తో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ తో పాటు నిర్వాహకులు మహ్మద్ హాజీ తెలంగాణ లో ని అన్ని వర్గాల వారి కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి నగరం నుండియో కాక చుట్టూ గ్రామాల నుండి ప్రజలు తరలి వచ్చారు. కార్యక్రమం లో మహ్మద్ అఫ్జల్ ఖాన్, ముత వల్లి మహ్మద్ మాజిద్, దర్గ్హా నిర్వాహకులు మహ్మద్ హాజీ, మహ్మద్ అజ్మత్, మహ్మద్ సమీయోద్దీన్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్, నిసార్ అహ్మద్ ఖాన్, షేక్ సాజిద్, ఎంపిటిసి డపు సాయి బాబా , ఖదీర్,నసీర్, ఉబేద్, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.6ఎస్పీటీ -1: దర్గా లో ప్రార్ధన లు చేస్తున్న దృశ్యం
ఘనంగా శామీర్ పేట్ సయ్యద్ జలాలుద్దీన్ బాబా దర్గాలో ఉర్సు ఉత్సవాలు




