Wednesday, 4 November 2026

ప్రాథమిక పశువైద్య కేంద్రంలో వరల్డ్ జనోసిస్ డే కార్యక్రమం

 

 

 

 

 

 

 

 

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ ప్రాథమిక పశువైద్య కేంద్రంలో గురువారం వరల్డ్ జనోసిస్ డే సందర్భంగా పెంపుడు జంతువులకు మరియు పాడి పశువులకు రాబిస్ టికలను మరియు ఇతర మందులను ఇచ్చి అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా
పశు వైద్యాడు డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ మనుషులకు జంతువులకు ఎన్నో యుగాల నుండి జీవన సంబంధం ఉన్నదని. వాటితో చనువు, స్నేహం ఎక్కువగానే ఉందని. మనిషి తన జీవనోపాధి మరియు సంతోషం కోసం పశువుల పెంపకం, పక్షల
పెంపకం వంటి వాటిని పోషించడంతోపాటు వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారని . ఆ జంతువుల నుంచి మనుషులకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఇలా సహజ సిద్ధంగా సంక్రమించే వాటిని జూనోసిస్‌ వ్యాధులు అంటారని, ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు 200 వరకు ఉన్నాయని, ఆ వ్యా ధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనంతరం మండల బీఆర్ ఎస్ నాయకులు
జడ్పీటీసీ నారోజి గంగారాం , అక్కపల్లి నాగేందర్, విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి
మాజీ విండో చైర్మన్ పత్తిరాము, ప్రజల్లో అవగాహనా తేవడానికి
మాట్లాడుతూ, పశువుల నుంచి సోకే ఆంత్రాక్స్‌, కుక్కల నుంచి వ్యాపించే రెబీస్‌ వ్యాధులు పందుల నుంచి సంక్రమించే స్వైన్‌ ఫ్లూ,
ఈ కోవకు చెందినవే. వీటి బారిన పడితే ప్రాణాలు కూడా కోల్పోవచ్చుని తెలిపారు, అంతే కాకుండా రుద్రూర్ మండల పరిధిలోగల ప్రతి గ్రామపంచాయతీ నుండి పెంపుడు కుక్కల్ని వారి యజమానులు ద్వారా తీసుకొని వచ్చేలా చేసి వాటన్నింటికీ పిచ్చికుక్క వ్యాధి నిరోధక టీకాలు వేసేలా చేయడం పట్ల రైతులు , గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.