అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నవంబర్ 21( జనం సాక్షి ) న్యాలకల్ మండలం లోని మాల్గి, రత్నాపుర్, మిరియంపుర్, హుమ్నపుర్, ఇబ్రహింపూర్ గ్రామాలలో కోటి* రూపాయల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు మరియు 5 లక్షల సిడీపీ నిధులతో మల్గి గ్రామం లో బిసి కమ్యూనిటీ హల్ పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మల్గీ గ్రామ సర్పంచ్ మారుతి మరియు గొల్ల కుర్మా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొంగడి,గజ మాల తో ఘనంగా సన్మానించి గొర్రె పిల్లను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షం అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది చెందలన్నదే తెలంగాణ ప్రభుత్వం కెసీఆర్ లక్ష్యం అన్నారు.ఆయా కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంట రెడ్డీ, మండల పార్టీ అద్యక్షులు రవీందర్, బస్వరాజ్ పాటిల్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కుమార్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, సర్పంచ్ ఫోరమ్ ఉపఅద్యక్షులు పీటర్, మండల యూత్ అద్యక్షులు ఉమేష్ పటేల్,
సర్పంచ్ లు మారుతి, రవి, అబ్బేంద మర్తమ్మా, సంగీత రాజు, తిప్పమ్మ పర్షురం,ఎంపీటీసీ శివానంద శ్రీపతి, చంద్రన్న, గ్రామ పార్టీ అద్యక్షులు సిద్ధ రెడ్డీ, అశోక్ పటేల్, ఆత్మ డైరక్టర్ రాజు, డిప్యూటీ సర్పంచ్ గ్హౌస్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, రత్నం, ఇమ్రాన్, రాజేందర్ రెడ్డీ, సంగమేశ్, సునీల్, అనిల్, మోహన్, లోకేష్ పటేల్, అనిల్, అశోక్, వీర్ శెట్టి, ఎఇ కృష్ణ, సూపరింటెండెంట్ రాజ్ శేకర్, శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు




