Monday, 2 November 2026

అన్నపూర్ణ స్టూడియోలో వ్యక్తి అనుమానాస్పద మృతి

– మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు
హైదరాబాద్‌, మే31(జ‌నం సాక్షి) : అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి(53) అనే వ్యక్తి గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియో సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి ఎదుట నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.