స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ..

ఇల్లందు ఆగస్టు 30(జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వాక్యాలు చేసిన గుమ్మడి అనురాధ.. ఎల్లందు ప్రెస్క్లబ్లో నిర్వర్తించిన విలేకరుల సమావేశంలో అనురాధ పాల్గొని మాట్లాడుతూ.. ఎల్లందు ప్రజల కోరికపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇల్లందు ప్రజలు నియోజకవర్గానికి విద్యావంతురాలు, రాజకీయ అనుభవం తరాలు అయినటువంటి అభ్యర్థిని ఆశిస్తున్నారని, ఐదు సార్లు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతురుగా తన అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అనుభవం కలిగి ఉండి విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఘనత నాకు ఉన్న కారణంగా వివిధ కుల సంఘాల, వివిధ రాజకీయ నాయకుల అన్నిటికీ మించిన ఎల్లందు ప్రజల కోరిక మేరకు ఇల్లందును అభివృద్ధి చేసే దిశగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి ఆశీస్సులు పొంది మీ అందరి ఆధారన అభిమానలతో నన్ను ఆదరించిగెలిపిస్తే ఇల్లందు పట్టణ అభివృద్ధికి నిస్వార్ధంగా పనిచేస్తానని తెలిపారు.